ప్రజల ఆరోగ్యం కంటే స్థానిక ఎన్నికలే ముఖ్యమా ?..
ఏపి ప్రభుత్వంపై టిడిపి నేత వర్ల రామయ్య ఫైర్

అమరావతి: రాష్ట్రంలో కరోన వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికలను మాజి ఎస్‌ఈసి వాయిదా వేశారని టిడిపి సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంలో ఎన్నికలు వాయిదా వేయగా.. అది ప్రభుత్వంతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, ఆయనపై వైయస్‌ఆర్ సిపి నేతలు ద్వేషాన్ని పెంచుకున్నారు. కాని ఎన్నికలు వాయిదా వేసే అంశాన్ని ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం లేదని, ఎస్‌ఈసికి ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఉంటుందని రామయ్య అన్నారు. ప్రభుత్వానికి మాత్రం ప్రజల ఆరోగ్యం కంటే స్థానిక ఎన్నికలే ముఖ్యమయ్యాయని రామయ్య అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, అందుకే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని వర్ల రామయ్య చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/