రేపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

cm-jagan

ఏపీ సీఎం జగన్ రేపు (శుక్రవారం) వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో జగన్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 9.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. కోతులగుట్ట గ్రామం చేరుకున్న తర్వాత వరద ప్రభావం, తీసుకుంటున్న చర్యలను అధికారులతో సమీక్షించనున్నారు. కూనవరంలో వరద బాధిత కుటుంబాలను కలిసి భరోసా ఇవ్వనున్నారు.

నాల్గు రోజుల క్రితం వరకు తెలంగాణ లో విస్తారంగా వర్షలు పడిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు భారీ వరదలతో గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ముంపు గ్రామాలన్నీ వరదలో చిక్కుకున్నాయి. నాల్గు రోజుల వరకు ఆ గ్రామాలూ నీటిలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు , వరదలు తగ్గుముఖం పట్టడం తో ముంపు గ్రామాల ప్రజలు బయటకు వస్తున్నారు. జగన్ సర్కార్ సైతం ముంపు గ్రామాల ప్రజలను నిత్యావసర పంపిణి చేసి ఆదుకుంది. పప్పు , బియ్యం , కూరగాయలు వంటివి అందించింది.