ముఖ్యమైన మైలురాయిని చేరుకున్న అంకుర 9 ఎం హాస్పిటల్

Ankura 9M Hospital Reaches Important Milestone

హైదరాబాద్‌: మహిళలు మరియు పిల్లల కోసం ప్రముఖ ఆరోగ్య సంరక్షణ ప్రదాత 9M బై అంకుర హాస్పిటల్ , 100 vNOTES (వజినల్ నేచురల్ ఓరిఫైస్ ట్రాన్స్‌లూమినల్ ఎండోస్కోపిక్ సర్జరీ) ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేయడంలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినట్లు ప్రకటించింది. గచ్చిబౌలిలోని 9M బై అంకుర హాస్పిటల్ వద్ద సీనియర్ ప్రసూతి వైద్యులు , గైనకాలజిస్ట్, వంధ్యత్వ నిపుణులు & లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వింధ్య జెమరాజు MBBS, DGO, DNB,. ఈ ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రభావవంతమైన ఈ కొత్త విప్లవాత్మక శస్త్రచికిత్సా విధానాన్ని నిర్వహించటంలో అంకుర హాస్పిటల్ సంపాదించిన నైపుణ్యంలో ఒక అద్భుతమైన పురోగతిని ఈ మైలురాయి సూచిస్తుంది, ఇది ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు రోగులకు మెరుగైన కాస్మెటిక్ ఫలితాల కోసం బాహ్య కోతలను తగ్గిస్తుంది.

ప్రత్యేకమైన ప్రక్రియ అయినటువంటి , vNOTES లాపరోస్కోపీ లో , ఒక మృదువైన ఎండోస్కోప్ సహజ ద్వారం ద్వారా చొప్పించబడుతుంది మరియు దీనిని ఉదర కుహరానికి తీసుకువెళతారు . ఇది సర్జన్ ప్రత్యేక శస్త్రచికిత్సా పరికరాలను ఉపయోగించి అంతర్గత అవయవాలను వీక్షించడానికి మరియు ఆపరేట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ విధానం, పొత్తికడుపు గోడకు గాయాన్ని తగ్గిస్తుంది మరియు శస్త్రచికిత్స అనంతర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, దీని ఫలితంగా రోగి వేగంగా కోలుకోవడం తో పాటుగా ఆసుపత్రిలో గడపాల్సిన సమయం కూడా తగ్గుతుంది. vNOTES లాపరోస్కోపీ అనేది కొత్త టెక్నిక్, vNOTES సర్జరీలను తప్పనిసరిగా నిపుణుల పర్యవేక్షణ లో నిపుణులు మాత్రమే చేయాలి. vNOTES శస్త్రచికిత్సతో బాహ్య కోతలు ఉండవు మరియు మెరుగైన కాస్మెటిక్ ఫలితాలు మరియు రిస్క్ తగ్గడంతో రోగికి సంతృప్తి కూడా పెరుగుతుంది.

గచ్చిబౌలిలోని 9M బై అంకుర హాస్పిటల్ వద్ద సీనియర్ ప్రసూతి వైద్య నిపుణులు , గైనకాలజిస్ట్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ & ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వింధ్య జెమరాజు మాట్లాడుతూ, “9M బై అంకుర హాస్పిటల్ వద్ద 100 విజయవంతమైన vNOTES ప్రక్రియల మైలురాయిని సాధించినందుకు మేము సంతోషిస్తున్నాము. నేను vNOTESలో ప్రత్యేక శిక్షణ పొందాను మరియు 9M బై అంకుర హాస్పిటల్ వద్ద ఈ కొత్త విధానాన్ని ప్రారంభించాము. ఇది మా రోగుల విశ్వాసాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడింది మరియు బాహ్యంగా కనిపించే కోతలు లేకుండానే మేము చాలా శస్త్రచికిత్సలను నిర్వహించేలా చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రక్రియల తర్వాత మా రోగులకు మెరుగైన సౌందర్య ఫలితాన్ని అందించడం సాధ్యమైనది. ఇది మా రోగి సంతృప్తి స్కోర్‌లను గణనీయంగా మెరుగుపరచడంలో సహాయపడింది. 9M బై అంకుర హాస్పిటల్ వద్ద మేము తాజా సాంకేతికతలను స్వీకరించటం కొనసాగిస్తాము తద్వారా అధిక విజయాల రేటు, తక్కువ శస్త్రచికిత్స అనంతర సమస్యలు మరియు మెరుగైన రోగి సంతృప్తిని నిర్ధారిస్తాము…” అని అన్నారు.

గచ్చిబౌలిలోని 9M బై అంకుర హాస్పిటల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ గొట్టిపాటి మాట్లాడుతూ, “ అత్యంత క్లిష్టమైన వైద్య సమస్యలు ఉన్న రోగుల ప్రాణాలను కాపాడటం మరియు నొప్పిని తగ్గించడానికి , రోగి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి నూతన వైద్య పద్ధతులు ఉపయోగించు కోవటంలో మా నిబద్ధత కారణంగా మేము దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహిళలు మరియు పిల్లల ఆసుపత్రులలో ఒకటిగా నిలిచాము. మేము మా వైద్యులను తాజా సాంకేతికతలను నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాము మరియు గరిష్టంగా రోగి కి సంతృప్తి , సౌకర్యాన్ని అందించడానికి వాటిని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాము. డా. వింధ్య జెమరాజు నాయకత్వంలో 100 vNOTES విధానాలను విజయవంతంగా పూర్తి చేసిన మైలురాయిని సాధించినందుకు మేము సంతోషిస్తున్నాము…” అని అన్నారు.

9M బై అంకుర హాస్పిటల్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ , “9M బై అంకుర హాస్పిటల్ వద్ద మేము దేశంలోని మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేకమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉన్నాము. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుల బృందంతో, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అత్యుత్తమ సదుపాయాలను మేము రోగులకు అందిస్తున్నాము. డాక్టర్ వింధ్య 3 సంవత్సరాలలో 100 vNOTES ప్రక్రయలను పూర్తి చేసిన మైలురాయిని సాధించారు మరియు 9M బై అంకుర హాస్పిటల్ వద్ద మేము ఈ సాధనకు చాలా గర్వపడుతున్నాము…” అని అన్నారు.