జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

Allahabad HC allows ASI to conduct survey of Gyanvapi mosque complex in Varanasi

అలహాబాద్ః వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన కీలక ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేసేందుకు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలంటూ ఏఎస్ఐకు అనుమతులు ఇచ్చింది. ఈ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసింది హైకోర్టు. అయితే, సర్వే సమయంలో మసీదు కట్టడానికి ఎలాంటి నష్టం జరగకుండా చూయాలని సూచించింది. జ్ఞానవాపి మసీదులో ఎలాంటి నిర్మాణాలు కూల్చలేదని ASI హైకోర్టుకు తెలిపింది. ఈవిషయంపై హైకోర్టులో ASI అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. అయితే తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని , సుప్రీంకోర్టులో తిరిగి పిటిషన్‌ వేస్తామని ముస్లిం సంఘాలు ప్రకటించాయి. ఇకపోతే సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించిందని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ పక్షాన ప్రాతినిథ్యం వహిస్తున్న లాయర్ విష్ణు శంకర్ జైన్ తెలిపారు.