నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన

Seventh day Jagan memantha siddham yatra

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం హిందూపుర పార్లమెంటు పరిధిలోని హిందూపురం పట్టణంలో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం చిత్తూరుపార్లమెంటు పరిధిలోని పలమనేరు నియోజకవర్గం పరిధిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు నియోజకవర్గంలోని నెల్లూరు నగరంలో జరిగే ప్రచారానికి ఆయన హాజరు కానున్నారు. జగన్ పర్యటన కు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు చేసారు.