‘గురూజీ ‘ అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్

నిర్మాత , నటుడు బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘సాగినంత కాలం నా అంత వాడు లేడందురు. సాగకపోతే ఊరికే చతికిల పడిపోవుదురు. చెప్పడమే నా ధర్మం… వినకపోతే నీ కర్మ గురూజీ… భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి’ అని ట్వీట్స్ చేసారు.

ఈ ట్వీట్ చూసిన వారంతా గణేష్..చేసింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పైనే అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే కొద్దీ నెలలుగా త్రివిక్రమ్ – గణేష్ మధ్య సైలెంట్ వార్ నడుస్తుందని , గణేష్ – పవన్ కు మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమే కారణమని , అందుకే గణేష్ , త్రివిక్రమ్ ఫై కోపం తో ఉన్నాడని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు.