జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

కోర్టుకు హాజరైన ఇతర నిందితులు

AP CM Jagan
AP CM Jagan

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులకేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈరోజు కోర్టులో జరిగిన విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. న్యాయమూర్తి కేసు విచారణ ప్రారంభించిన అనంతరం తదుపరి విచారణ మార్చి 6వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/