నాలుగో రోజుకు చేరుకున్న మేమంతా జగన్‌ సిద్ధం బస్సు యాత్ర

jagan-memantha-siddham-yatra-4th-day-road-map

అమరావతిః ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో కొనసాగిన యాత్ర… ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. నిన్న రాత్రి కర్నూలు జిల్లా పత్తికొండలోని కేజీఎన్ ఫంక్షన్ హాలు వద్ద జగన్ బస చేశారు. ఈనాటి యాత్ర పత్తకొండ నుంచి ప్రారంభమవుతుంది. గుంతకల్ నియోజకవర్గం బసినేపల్లి వద్ద యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గుత్తిలో జగన్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో జగన్ బస చేస్తారు.