కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మి

Hyderabad Mayor Vijayalakshmi joined the Congress

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఈరోజు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. విజయలక్ష్మి తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన నిన్న రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే ప్రారంభమయిందని, నాలుగు దశాబ్దాల పాటు తాను కాంగ్రెస్ లో ఉన్నానని, కాంగ్రెస్ లోనే చస్తానని నిన్న ఆయన తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు.