ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి

ఆసుపత్రి వర్గాలు వెల్లడి

Shortage of beds in Delhi Hospitals
Shortage of beds in Delhi Hospitals

New Delhi: ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల తీవ్రత దృష్ట్యా రాజధాని నగరంలో కరోనా ఆసుపత్రుల్లో బెడ్స్ అన్నీ నిండిపోయాయి.

ఇకపై వచ్చే రోగులకు బెడ్స్ లేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఆసుపత్రులే స్వయంగా ప్రకటించాయి. 

కరోనా చికిత్సలు అందిస్తున్న మ్యాక్స్ హాస్పిటల్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్స్, తమ ఆసుపత్రులు నిండిపోయాయని పేర్కొన్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/