ముద్దు సీన్లలో నటిస్తే తప్పేంటి..? – అనుపమ

అనుపమ తాజాగా డీజే టిల్లు 2 మూవీ లో సిద్ధుకు జోడిగా నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ముద్దు సీన్లలో రెచ్చిపోవడం తో అంత షాక్ అవుతూ..అనుపమ ఇలాంటి సీన్లు చేయడం ఏంటి అని కొంతమంది అభిప్రాయపడుతుంటే..హమ్మయ్య ఇప్పటికైనా ట్రాక్ లోకి వచ్చిందని మరికొంతమంది తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ముద్దు సీన్లలో నటిస్తే తప్పేంటి అని అనుపమ ప్రశ్నించింది.

కథ డిమాండ్ చేస్తే లిప్లాక్ సీన్స్లో నటించడం తప్పేం కాదని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు. ‘నేనిప్పుడు నటిగా చాలా పరిణతి చెందా. ఒకే తరహా పాత్రల్లో నటించి బోర్ కొడుతోంది. టిల్లు స్క్వేర్ మూవీలో లిప్లక్ సీన్లో నటించడాన్ని కొంత మంది తప్పుబడుతున్నారు. ఆ సినిమా చూడకుండా వారు విమర్శిస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సినిమా చూసి మాట్లాడాలి’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా.. అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ మూవీ 9 రోజుల్లో రూ. 52 కోట్లకు పైగా షేర్‌ను వంద కోట్ల వరకూ గ్రాస్‌ను రాబట్టి సత్తా చాటింది.