సౌరవ్ గంగూలీకి Z కేటగిరీ భద్రత పెంపు

West Bengal govt to upgrade security cover of Sourav Ganguly to Z category

కోల్‌కతాః భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం Y కేటగిరీ భద్రత కలిగివున్న గంగూలీకి ఇకపై Z కేటగిరీ భద్రత కల్పించనున్నారు. పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం బెంగాల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గంగూలీకి Z కేటగిరీ భద్రత అందుబాటులోకి రాగానే కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలోగల ఆయన ఇంటివద్ద ఎప్పుడూ (24 గంటలపాటు) ఇద్దరు ప్రత్యేక భద్రతా అధికారులు కాపలాగా ఉండనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన ఇంటివద్ద ఉన్న భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా మరింత పెంచనున్నారు. దేశంలోని పలువురు సెలెబ్రిటీలకు ప్రస్తుతం ఈ Z కేటగిరి భద్రత కొనసాగుతున్నది.