విజయనగరం పర్యటనకు వెళ్లిన సిఎం జగన్‌

విజయనగరంలో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న జగన్

jagan-left-to-vizianagaram

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయనగరం పర్యటనకు బయల్దేరారు. విజయనగరంలో ఆయన మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. అక్కడ దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచే వర్చువల్ గా రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదక మీద నుంచి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో విజయనగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండేలా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.