అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళన బాట

అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళన బాట చేపట్టారు. చలో విజయవాడ కు పిలుపునివ్వడం తో ఏపీ నలుమూలల నుంచి వందలాది మంది విజయవాడకు చేరుకుంటున్నారు. దీంతో సంఘం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైళ్లలో వస్తున్న వారిని స్టేషన్‌లోనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 144 తోపాటు పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 30 కింద కూడా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీటిని ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలు, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని… అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.