ప్రభుత్వ ఉద్యోగులను జగన్ మరోసారి మోసం చేస్తున్నారుః పట్టాభి

సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ హామీ ఇవ్వలేదన్న పట్టాభి

jagan-is-cheating-employees-once-again-says-pattabhi

అమరావతిః ప్రభుత్వ ఉద్యోగులపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కక్ష కట్టిందని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. ఓవైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతూనే… మరోవైపు ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ నిర్వహించిన చర్చల్లో సీపీఎస్ రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. గతంలో ప్రకటించిన జీపీఎస్ నే అమలు చేయనున్నట్టు తెలిపిందని చెప్పారు. పీఆర్సీకి కమిటీ పేరుతో మరోసారి కాలయాపన చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మరోసారి మోసం చేస్తున్నారని అన్నారు.