బ్రేకింగ్ : మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. 26 మంది మావోలు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏకంగా 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. అంతేకాదు ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

ధనోరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయలైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు అంకిత్‌ తెలిపారు.

ఉదయం 6 గంటల సమయం నుంచి… మధ్యాహ్నం వరకు పోలీసులు… అలాగే మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్.. మీడియాకు తెలిపారు. పక్కా సమాచారం మేరకు మావోయిస్టుల స్థావరం పై తాము దాడులు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.