జగన్ సర్కార్ ఫై కేంద్రమంత్రి అమిత్ షా నిప్పులు ..

జగన్ మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రైతుల సంక్షేమ ప్రభుత్వం నడిపిస్తున్నామని సీఎం జగన్ చెబుతున్నారు. కానీ దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. ఇది చూసైనా ఏపీ సీఎం జగన్ సిగ్గు పడాలన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పా ఏమీ చేయలేదంటూ అమిత్ షా మండిపడ్డారు.

9 ఏళ్లలో 70 కోట్ల పేదల కోసం పక్కా ఇళ్లు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. 9 కోట్ల పేదలకు 13 కోట్ల ఉచిత సిలిండర్లు అందించామన్నారు. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.6000 జమ చేస్తున్నారు. మోడీ ఇస్తున్న ఈ డబ్బును తాను ఇన్నానని చెప్పి సీఎం జగన్ రైతులను మభ్యపెడుతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.

పరిపాలన అంటే మోడీని చూసి నేర్చుకోవాలన్నారు. దాయాది పాక్ తోక జాడించి మన సైన్యంపై, సిబ్బందిపై దాడులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ తో సమాధానం చెప్పిందని గుర్తుచేశారు. దేశాన్ని కాపాడే బాధ్యతను ప్రధాని మోడీ తీసుకున్నారు. అంతర్గత భద్రత పటిష్టం చేయడంతో తో పాటు పొరుగు దేశాల నుంచి దాడుల భయం లేకుండా చేసిన ఘనత మోడీ సొంతమన్నారు.