హైదరాబాద్ బయోడైవర్సిటీ వద్ద ఫ్లై ఓవర్ ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్ బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఎస్ఆర్డీపీ లో భాగంగా నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్‌ను మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రూ.30.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ తో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈకార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/