బండి సంజయ్ – రాజాసింగ్ అరెస్ట్ లపై ఈటెల రాజేందర్ ఫైర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ల అరెస్ట్ లను తప్పుబట్టారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మొహమ్మద్ ప్రవక్త పై రాజాసింగ్ విడుదల చేసిన వివాదాస్పద వీడియో పై పోలీసులు రాజా సింగ్ ని అరెస్టు చేయడం..లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని ఆరోపిస్తూ నిన్న కవిత ఇంటిదగ్గర బిజెపి కార్యకర్తలు నిరసనకు దిగారు. వారి అక్రమ అరెస్టుకి నిరసనగా దీక్ష చేయాలని నేడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దీక్షకు దిగిన బండి సంజయ్ ని దీక్ష భగ్నం చేసి అరెస్టు చేశారు పోలీసులు.

ఇలా ఇద్దరు కీలక నేతలను అరెస్ట్ చేయడం పట్ల బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి అరెస్ట్ లను తీవ్రంగా ఖండిచారు హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసులతో, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభ ఫెయిల్ అయ్యిందిని.. బీజేపీ నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని, ప్రగతిభవన్ ప్లాన్ లో భాగంగానే బండి సంజయ్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మరోవైపు కేంద్రం సైతం బండి సంజయ్ కి ఫోన్ చేసి వివరాలు అడిగితెలుసుకున్నారు.