రాష్ట్రపతి, కేంద్రమంత్రికి రఘురామ లేఖలు

పరిస్థితులు దిగజారకముందే ఏపీలో కేంద్ర బలగాలను మోహరించండి: రఘురామ కృష్ణరాజు

అమరావతి: ఏపీలోని టీడీపీ కార్యాలయంపై దాడులను నిరసిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. ఆ దాడుల వెనక ఉన్నదెవరో నిగ్గుతేల్చాలని ఆ లేఖల్లో కోరారు. ఇందుకోసం అవసరమైతే సీబీఐ, ఎన్ఐఏతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారకముందే చర్యలు తీసుకోవాలని, కేంద్ర బలగాలను ఏపీకి పంపాలని కోరారు.

అలాగే, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి చేసి ఆయన భార్య, పిల్లలను దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర పోలీసులు నమ్మకం కోల్పోయారని, కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకుని దాడుల వెనకున్న కుట్రదారులు ఎవరో తేల్చాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/