నేడు విశాఖ లో అమిత్ షా భారీ సభ

బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాల ఫై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగురవేయాలని చూస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో పలు సభలు ఏర్పాటు చేసిన అధిష్టానం..ఇప్పుడు ఏపీ లో భారీ సభలు నిర్వహించాలని చూస్తుంది. ఈ క్రమంలో నేడు వైజాగ్ లో అమిత్ షా పర్యటించనున్నారు. విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్‌ అభియాన్ సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు అమిత్‌షా. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. అయితే.. విశాఖ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది.

నగరంలో అమిత్ షా బహిరంగ సభ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో బందోబస్తుకు సంబంధించి అధికారులతో విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.సి.యం.త్రివిక్రమ వర్మ సమావేశం నిర్వహించారు. మొత్తం నలుగురు డిసిపీ లు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు, 04 స్పెషల్ పార్టీ లతో మొత్తంగా 950 సిబ్బంది, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బందో బస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ, ఎయిర్ పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయనున్న పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ ఆయన పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందొబస్తూ నిర్వహించాలని అధికారులను విశాఖ సీపీ ఆదేశించారు.