చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై నిప్పులు చెరిగిన సీఎం జగన్

jagan fire on chandrababu, pawan kalyan

ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని , దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదని జగన్ ఎద్దేవా చేశారు.

వరుసగా ఐదో ఏడాది వైయ‌స్ఆర్‌ మ‌త్స్య‌కార భ‌రోసా ద్వారా వేట నిషేధ భృతిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందించింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో జగన్ పాల్గొని , కంప్యూట‌ర్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మ‌త్స్య‌కార భ‌రోసా సాయాన్ని జమ చేసారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేసారు.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను.. వైఎస్ఆర్ మత్స్య కార భారోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించాం.. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్యకార కుటుంబాలకు ఉపయోగ పడుతుందని వివరించారు. ఇదే సందర్బంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై ఫైర్ అయ్యారు. ఏపీలో దోచుకుని..తెలంగాణలో చంద్రబాబు , పవన్ బ్రతుకుతున్నారని జగన్ అన్నారు.