గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..? అంటూ మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న

తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తనను సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదని గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. స‌చివాల‌యం ప్రారంభానికి గ‌వ‌ర్న‌ర్‌ను పిల‌వాల‌ని రాజ్యాంగంలో ఉందా..? అని సూటిగా ప్ర‌శ్నించారు.

వందే భార‌త్ రైలు ప్రారంభానికి రాష్ట్ర‌ప‌తిని ప్ర‌ధాని పిలిచారా..? వందే భార‌త్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తార‌ని మేం అడిగామా..? ఎన్ని సార్లు.. ఎవ‌రు ప్రారంభించాలో కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ ఇష్టం. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగించేలా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌వ‌ర్త‌న ఉంది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్య‌వ‌హార శైలి బాధ క‌లిగిస్తోంది అని హ‌రీశ్‌రావు అన్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో తమిళసై మాట్లాడుతూ… భారత్ కు వచ్చే దేశాధినేతలను కూడా కలుసుకునే అవకాశం ఉంటుందని, తెలంగాణలో సీఎంను కలిసే అవకాశం మాత్రం ఉండదని, ఇది దురదృష్టకరమన్నారు. కొన్ని దేశాలు దగ్గర కావొచ్చు కానీ తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ దగ్గర కావన్నారు.