హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని ఓ హాస్టల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 11 మంది మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్ అగ్నిప్రమాద ఘటన దారుణమని, ఇది విషాదాన్ని నింపినట్లు ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తెలిపారు.
హాస్టల్‌లో 92 రూమ్‌లు ఉన్నాయి. నిర్మాణ రంగం, హాస్పిటల్ స్టాఫ్, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు కూడా ఆ హాస్టల్‌లో బస చేస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల తమ వస్తువులన్నీ కోల్పోయినట్లు కొందరు చెప్పారు. హాస్టల్‌లో 52 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నట్లు ఫైర్ అండ్ ఎమర్జెన్సీ అధికారులు చెబుతున్నారు. అనేక మంది డిపోర్టీలు ఆ హాస్టల్‌లో ఉంటున్నారని, చాలా మంది మిస్సైనట్లు తెలుస్తోందని అడ్వకేట్ ఫిలిపా పెయిన్ తెలిపారు. లోఫర్స్ లాడ్జ్ టాప్ ఫ్లోర్‌లో అర్థరాత్రి తర్వాత అగ్నిప్రమాదం జరిగింది.