రేపు పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన

రూ.42,750 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ రేపు పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిరోజ్​పుర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన శాటిలైట్ సెంటర్‌ను మోడీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ర్యాలీలో పాల్గొననున్నారు. అలాగే రూ.42,750 కోట్లకుపైగా విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌, ఢిల్లీ నుంచి కత్రా వరకు నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ద్వారా ప్రయాణ సమయం తగ్గిపోనుంది. అలాగే ప్రధాన మత కేంద్రాలు, ముఖ్య సిక్కు మతపరమైన ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీని పొందేందుకు ప్రధాని ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అలాగే అక్కడున్న వైష్ణో దేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/