నాగ చైతన్య కారుకు ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు

ఈ మధ్య సినీ ప్రముఖుల కార్లకు వరుసపెట్టి ఫైన్ లు విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటించకపోయిన సరే..వదిలిపెట్టకుండా ఫైన్ లు విధిస్తున్నారు. ముఖ్యంగా కార్లపై స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ కార్లకు ఫైన్ విధించగా..తాజాగా అక్కినేని నాగచైతన్య కారులకు ఫైన్ విధించారు.

సోమవారం జూబ్లీ హిల్స్ లో తనిఖీల సమయంలో అటుగా వచ్చిన నాగచైతన్య కారును ఆపి జరిమానా విధించారు. బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దాన్ని తొలగించి… రూ. 700 ఫైన్ వేశారు. బ్లాక్ ఫిల్మ్ తో పాటు వాహనాలపై ప్రెస్, డాక్టర్ ఇలా స్టిక్కర్లు ఉన్న వాహనాలకు ఫైన్ వేస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ , కళ్యాణ్ రామ్ , మంచు మనోజ్ , త్రివిక్రమ్ లకు ఫైన్ వేయడం జరిగింది.