ఖేలో ఇండియా విజేతలకు సీఎం జగన్ అభినందనలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఏపీ అథ్లెట్ల ప్రదర్శనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఖేలో ఇండియా-2022 క్రీడల్లో రాష్ట్రానికి చెందిన కుంజా రజిత 400మీ పరుగులో స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్ లో మరో ఏపీ అథ్లెట్ పల్లవి మూడోస్థానంతో కాంస్యం అందుకుంది. ఇక, శిరీష వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో 64 కేజీల విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకుంది. ఈ తరుణంలో జగన్ ట్విట్టర్ ద్వారా వారికీ అభినందనలు తెలిపారు.

‘‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించినందుకు ఛాంపియన్‌లు రజిత, పల్లవి, శిరీషలకు అభినందనలు. ఉక్కు సంకల్పం కలిగిన ఈ అమ్మాయిలు ఏపీకి గర్వకారణంగా నిలిచారు. వీళ్ల విజయం.. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన పటిమ, కలలను సాధనకు చేసిన కృషి.. ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Congratulating champions Rajitha, Pallavi & Sireesha for their spectacular victories in the Khelo India Youth Games.
The iron-willed girls have made AP proud. Their fighting spirit to succeed against all odds is an inspiration for countless aspirants to achieve their dreams.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2022