తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

తెలంగాణలో కాంగ్రెస్ (Congress)ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు..ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అమోదం తెలిపారు. ఈ భేటికి సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు చూస్తే..

  • 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు…
  • ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇండ్లు…
  • లబ్ది దారులను గ్రామ సభల ద్వారా ఎంపిక…
  • కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం…
  • అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు…
  • 16 బీసీ , ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు…
  1. ముదిరాజ్ కార్పొరేషన్
  2. యాదవ కురుమ కార్పొరేషన్
  3. మున్నూరుకాపు కార్పొరేషన్
  4. పద్మశాలి కార్పొరేషన్
  5. పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్
  6. లింగాయత్ కార్పొరేషన్
  7. మేర కార్పొరేషన్
  8. గంగపుత్ర కార్పొరేషన్

ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)

  1. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
  2. ఆర్య, వైశ్య కార్పొరేషన్
  3. రెడ్డి కార్పొరేషన్
  4. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్
  5. మాల, మాల ఉప కులాల కార్పొరేషన్

    ఎస్టీల కోసం మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు
  • కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్
  • సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్
  • ఏకలవ్య కార్పోరేషన్

మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళలే నిర్వహించేలా మహిళా రైతు బజార్లు ఏర్పాటు…

  • అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ..ఆరోగ్య శ్రీ తో రేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.