కార్యకర్తలను , ప్రజలను హెచ్చరించిన జనసేన అధినేత

pawan kalyan demands Rs 1 Cr compensation in Eluru fire accident
pawan kalyan interesting tweet

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..జనసేన కార్య కర్తలను, రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ హెచ్చరిక జారీ చేసారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జగన్ ను గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని పవన్ కళ్యాణ్ గతంలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మంగళగిరి పార్టీ సమావేశంలోనూ పొత్తుల ఫై స్పందించారు. అలాగే మూడు ఆప్షన్లను కూడా తెలియజేసారు. దీంతో టీడీపీ , బిజెపి పార్టీలు పొత్తులపై స్పందిస్తుండగా..వైసీపీ మాత్రం విమర్శలు చేస్తూ వస్తుంది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘జర బద్రం.. అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు.. సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే అని గుర్తెరగండి’ అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి పవన్ ఏ పార్టీ నేతలను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేది గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటె నిన్న జరిగిన ‘ గోదావరి గర్జన’ సభ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీకి మిత్రపక్షమైన జనసేన పేరుగానీ, ఆపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేరుగానీ ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. నడ్డా నోట జనసేనకు అనుకూలంగా ఏదైనా మాట వస్తుందని ఆ పార్టీ భావించింది. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటిస్తే స్వాగతిస్తామని కూడా జనసేన వివిధ ప్రకటనల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రసంగం ముగించడం జనసేన నాయకులను నిరాశపర్చింది. మొన్నటి వరకు బిజెపి పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని అనుకున్నారు కానీ ఏ ప్రకటన రాకపోయేసరికి నిరాశకు లోనయ్యారు.