పేద మహిళలకు జగన్ అన్నగా మారారు : రోజా

28 లక్షల ఇళ్లను మహిళలకు అందించారు

తిరుమల : సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల ఇళ్లను మహిళలకు అందించారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పేద మహిళలకు జగన్ అన్నగా మారారని చెప్పారు. దేశంలో నాలుగు ఇళ్లను నిర్మిస్తే అందులో ఒకటి ఏపీలోదని అన్నారు. 50 శాతానికి పైగా నామినేటెడ్ పదవులను మహిళలకు కేటాయించిన ఘనత జగన్ దని చెప్పారు. దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చి మహిళలకు అండగా నిలిచారని కొనియాడారు.

ఈరోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో రోజా, భూమన కరుణాకర్ రెడ్డిలు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజా పైవ్యాఖ్యలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/