రాజమహేంద్రవరంలో వలస కూలీల ఆందోళన

రైళ్లలో తమ సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్‌

migrant workers
migrant workers

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం బీహర్‌ చత్తీష్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలనుంచి సుమారు 400 మంది వలస కూలీలు వచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో వారంతా ఇక్కడే చిక్కుకుపోయారు. దీంతో అధికారులు వారిని రాజమహేంద్రవరం నన్నయ వర్సిటిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉంచారు. తాజాగా కేంద్రం వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు అనుమతినివ్వడంతో వారంతా స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ కు బయలు దేరారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్‌ అధికారులు వారిని లాలా చెరువు కూడలి వద్ద ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వారిన తమ సొంత రాష్ట్రాలకు రైళ్లలో పంపాలని డిమాండ్‌ చేయడంతో, ఇప్పటికిప్పుడు పంపడం కుదరదని, అందుకు కొంత సమయం పడుతుందని పోలీసులు అన్నారు. దీంతో వలస కూలీలు ఆందోళనకు దిగారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/