టీఆర్‌ఎస్ నాయకుడు అరెస్టు..

తల్వార్లు, డమ్మీ తుపాకీతో బెదిరించి పలువురి నుంచి భూములు లాక్కున్న కేసులో వరంగల్‌ జిల్లా నల్లబెల్లికి చెందిన మాజీ ఎంపీపీ, తెరాస మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పరకాల సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. 42 రోజుల క్రితం ఓ పోలీసు అధికారితో పాటు మరో ఏడుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు పాల్పడగా బాధితులు కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వరంగల్ ​జిల్లా నల్లబెల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సారంగపాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈయన ఆరెపల్లితో పాటు అనేక భూవివాదాల్లో తలదూర్చినట్లు గుర్తించారు. కేయూ క్రాస్ రోడ్​లోని ఓ భూమి విషయంలో నయీం అనుచరుడు వేణుగోపాల్ గ్యాంగ్​తో కలిసి సెటిల్ మెంట్ కు పాల్పడ్డట్లు ఐటెండిఫై చేశారు. అలాగే నగరంలోని న్యూశాయంపేట, కరీమాబాద్, తాళ్ల పద్మావతి కాలేజీ, భట్టుపల్లి రోడ్, పైడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ సెటిల్ మెంట్లలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.