నేడు అభ్యర్థులను ప్రకటించబోతున్న షర్మిల

ఏపీ ఎన్నికల కు సంబదించిన తమ పార్టీ ఎంపీ , ఎమ్మెల్యే అభ్యర్థులను ఈరోజు మధ్యాహ్నం ఇడుపులపాయ లో షర్మిల ప్రకటించబోతుంది. 117 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ దాదాపు ఖాయమైంది. బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ – పల్లంరాజు, రాజమండ్రి – గిడుగు రుద్రరాజు, విశాఖపట్నం – సత్యారెడ్డి, ఏలూరు – లావణ్య, అనకాపల్లి – వేగి వెంకటేష్, శ్రీకాకుళం – పరమేశ్వరరావు (డీసీసీ ప్రెసిడెంట్), విజయనగరం – రమేష్ కుమార్ (డీసీసీ ప్రెసిడెంట్), రాజంపేట – నజీం అహమ్మద్, చిత్తూరు – చిట్టిబాబు, హిందూపూర్ – షాహీన్, నరసరావుపేట – అలెగ్జాండర్, నెల్లూరు – దేవకుమార్ రెడ్డి, ఒంగోలు – సుధాకర్ రెడ్డి, మచిలీపట్నం – గొల్లు కృష్ణ పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.

పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఉన్నాయి. మంగళవారం ఖరారైన అభ్యర్థుల జాబితాను మంగళవారం (ఏప్రిల్ 2) అధికారికంగా ప్రకటిస్తామని షర్మిల స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో సీనియర్ నేత రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయబోతున్నారు.