ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది హింసకు పాల్పడుతున్నారు – పవన్

తనను రోజూ వందల మంది కలుస్తున్నారని, అందులో కొందరు తనను, సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కలవడానికి వస్తున్న వారిలో రోజూ 200 మందికి తాను ఫొటోలు ఇస్తున్నానని చెప్పారు. కానీ కొందరు బ్లేడ్ బ్యాచ్ వాళ్లు, ఫ్యాన్స్ ముసుగులో వచ్చి తనను, సెక్యూరిటీ వాళ్లను చిన్నగా కట్ చేస్తున్నారని పిఠాపురంలో జనసేన నేతలతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించారు.

మన ప్రత్యర్ధి పార్టీ సంగతి తెలుసు కదా అంటూ వైసీపీని ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు అభిమానులతో ఫొటోలు దిగడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని, రోజుకు 200 మందితో ఫొటోలు దిగుతానని, కానీ ఈ విషయంలో ప్రోటోకాల్ పాటిద్దామంటూ పవన్ కీలక సూచన చేశారు. ఇకపై ప్రతీ రోజూ పిఠాపురంలో 200 మందితో ఫొటోలు దిగేందుకు అవకాశం ఇస్తానని జనసేనాని వెల్లడించారు.