మోడి ప్రసంగంల్లో ఒక పదాన్ని తొలగించిన వెంకయ్య

ఏ ఒక్క సభ్యుడినీ దూషించే హక్కు మంత్రికి లేదన్న స్పీకర్

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సందర్భంగా ప్రధాని మోడి, ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ అజాద్ లు రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఒక్కో పదాన్ని ఛైర్మన్ వెంకయ్యనాయుడు తొలగించారు. పదాలను తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మరోవైపు, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురిపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఏ ఒక్క సభ్యుడినీ దూషించే హక్కు మంత్రికి లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్లమెంటరీ పద్ధతుల గురించి సుప్రియోకు అర్థమయ్యేలా చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి స్పీకర్ సూచించారు. ప్రధాని ప్రసంగం నుంచి పదాన్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/