జలుబు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించండి

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదు

etela rajender
etela rajender

హుజురాబాద్‌: ప్రజలు అలసత్వం ప్రదర్శించకుండా జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సూచించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేదని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటివరకు సుమారు 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి కూడా వైరస్‌ నిర్ధారణ కాలేదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో వైద్య పరీక్షలకు పుణె వెళ్లాల్సి వచ్చేదని..ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోనే 6 నుంచి 7 గంటల్లో పరీక్షల నివేదికలు వస్తున్నాయని చెప్పారు. వైరస్‌పై ఎప్పటిప్పుడు బులెటిన్‌ విడుదల చేస్తూ ప్రజల్లో విశ్వాసం పొందుతున్నామని వివరించారు. ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/