నేడే కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం

కార్యక్రమానికి వారే ముఖ్య అతిథులు

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో 60 మంది కామన్ పీపుల్ తో వేదిక పంచుకోనున్నారు. ఖఢిల్లీ నిర్మాతలుగ (ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఢిల్లీ) పేరుతో వివిధ రంగాలకు చెందినవారిని ఈ కార్యక్రమానికి గెస్ట్ లుగా ఎంపిక చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ తో డాక్టర్లు, టీచర్లు, ఫార్మాసిస్టులు, శానిటేషన్ వర్కర్లు, బస్సు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు, మహిళలకు సెక్యూరిటి అందించే మార్షల్స్, ఆటో డ్రైవర్లు, రైతులు, అంగన్ వాడీ వర్కర్లు, అథ్టెట్లు, స్కాలర్ షిప్ కోసం పేర్లు నమోదు చేసుకున్న ట్రిపుల్ ఐటీ, మెడికల్ స్టూడెంట్స్, పీడబ్ల్యూడీ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లు, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేసే డెలివరీ ఏజెంట్లు ఇతరులు వేదిక పంచుకోనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/