అది ‘ఇండియా’ కాదు.. ‘గమాండియా’: ప్రధాని మోడీ

విపక్ష కూటమిని గమాండియా అని పిలవాలన్న మోడీ

it-is-not-india-call-it-as-ghamandia-says-modi

న్యూఢిల్లీః ప్రధాని మోడీ విపక్ష ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. అది ‘ఇండియా’ కాదు.. ‘గమాండియా’ అని విమర్శించారు. హిందీలో గమాండియా అంటే గర్వం లేదా అహంకారం అని అర్థం. ఇండియా పేరుపై ఇటీవల మోడీ వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. వారి పాత రికార్డు నుంచి బయటపడేందుకు యూపీఏ ను ఇండియాగా రీబ్రాండ్ చేసుకున్నారని ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. దేశం మీద ఉన్న భక్తితో వారు ఇండియా అనే పేరు పెట్టుకోలేదని… దేశాన్ని దోచుకోవాలనే లక్ష్యంతో ఆ పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

మరోవైపు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఎన్డీయే – ఇండియా మధ్య పోటీ అంటే… మోడీ – ఇండియాకు మధ్య జరిగే పోటీ అని చెప్పారు. ఇండియాకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే ఎవరు గెలుస్తారనే విషయం అందరికీ తెలుసని అన్నారు.