కంగనా కు బిజెపి సీటు ఫిక్స్ అయినట్లేనా..?

బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ కు బిజెపి సీటు ఖరారైనట్లేనా..? అంటే అవుననే తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే తాను బీజేపీలో చేరుతానని ఆమె చెప్పడంతో.. నడ్డా ఆమె నిర్ణయాన్ని స్వాగతించినట్లు తెలుస్తుంది.

శనివారం ఓ మీడియా సంస్థ హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి నడ్డాతో పాటు కంగనా హాజరయ్యారు. ఈ సందర్బంగా కంగనా మాట్లాడుతూ.. రాజకీయాల్లో చేరేందుకు తాను సుముఖమేనని చెప్పారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్‌ లోని మండీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని తెలిపింది.

ఆ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ..‘‘కంగన రనౌత్ మా పార్టీలో చేరాలనుకుంటే ఆమెకు స్వాగతం. పార్టీతో కలిసి పని చేయాలనుకునేవారెవరికైనా మంచి అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం విషయానికి వస్తే, అది నా ఒక్కడి నిర్ణయం కాదు. దాని కోసం క్షేత్ర స్థాయి నుంచి, ఎన్నికల కమిటీ, ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు వరకు సంప్రదింపుల ప్రక్రియ ఉంది’’ అని తెలిపారు. నడ్డా మాటలు బట్టు చూస్తే అధిష్టానం ఒకే అంటే కంగనా కు టికెట్ ఇవ్వడం ఖాయం.