బతుకమ్మ ఆడిన రాహుల్..

రాహుల్ గాంధీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఐదో రోజు యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం జడ్బర్లలో రాహుల్ తన పాదయాత్రను కొనసాగించారు. గొల్లపల్లిలో పాదయాత్రలో చేస్తూనే మహిళలతో కలిసి, చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, జైరాం రమేశ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం బతుకమ్మ ఆడుతూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. తెలంగాణ ప్రజలు ఎంతో వేడుకగా చేసుకునే సంప్రదాయ పండుగ బతుకమ్మ. అంత గొప్ప చరిత్ర ఉన్న బతుకమ్మ ఆటను మహిళలతో సమానంగా రాహుల్ గాంధీ ఆడడం అందర్నీ ఆకట్టుకుంది.

అంతకు ముందు యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. ఇంతలో మనం పరుగెదామా.. రెడీ వన్ టు త్రీ అంటూ ఆయన పరుగు పెట్టారు. రాహుల్ ను చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు పెట్టారు. ఈ ఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈరోజు గొల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర రాజాపూర్, బాలానగర్ మీదుగా.. అన్నారం గేట్, షాద్ నగర్ వరకు కొనసాగనుంది.. బాలానగర్ జంక్షన్ దగ్గరున్న అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4గంటలకు బాలానగర్ జంక్షన్ దగ్గర నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కానుంది. ఏడు గంటలకు షాద్ నగర్ బైపాస్ దగ్గరున్న అన్నారం గేట్ వద్ద రాహుల్ మాట్లాడనున్నారు. షాద్ నగర్ దగ్గరున్న ఫరూక్ నగర్ లో నైట్ హాల్ట్ ఏర్పాటు చేశారు. మొత్తం ఈరోజు 22 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది.