విశ్వక్ ప్లేస్ లో శర్వానంద్ ను తీసుకుంటున్నాడా..?

విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనదైన స్టైల్ లో విభిన్నమైన సినిమాలు చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటూ వెళ్తున్న విశ్వక్.. డైరెక్టర్ అండ్ యాక్టర్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. కానీ షెడ్యూల్ మొదలుపెట్టే క్రమంలో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం , మ్యూజిక్ డైరెక్టర్ ను చేంజ్ చేయాలనీ చెప్పడం, పలు కండిషన్లు పెట్టడం చేయడంతో అర్జున్ మీడియా సమావేశం ఏర్పటు చేసి విశ్వక్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఫిలిం ఛాంబర్ లోను విశ్వక్ ఫై పిర్యాదు చేయడం జరిగింది. మరో హీరో తో సినిమా చేస్తానని చెప్పిన అర్జున్..ఇప్పుడు ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని అర్జున్ భావిస్తున్నాడట. ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్ గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. చాలా కాలం తరువాత ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ఆయన హిట్ అందుకున్నాడు. అలాంటి శర్వానంద్ ను అర్జున్ ఎంతవరకూ ఒప్పించగలుగుతారనేది చూడాలి.