న్యూ ఇయర్ కానుకగా బంగార్రాజు టీజర్ విడుదల

కింగ్ నాగార్జున , చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే..సినిమా ప్రమోషన్ల ను అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా.. రేపు న్యూ ఇయర్ సందర్బంగా అభిమానులకు కిక్ ఇవ్వబోతున్నారు.

ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్‌ ను రేపు ఉదయం 11.22 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. ఈ మేరకు పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. మరి ఆ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ ‘బంగార్రాజు’ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ చేయబోతారని అంటున్నారు కానీ అధికారిక ప్రకటన చేయలేదు. ఓకవేళ వస్తే రెండు పాన్ మూవీస్ మధ్య తట్టుకోగలదా అనేది చూడాలి.