‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభోత్సవం

Launching of Jagananna Vidya Kanuka Programme by Hon’ble CM of AP at Punadipadu

విజయవాడ: ‘ జగనన్న విద్యాకానుక’ పథకం ప్రారంభమైంది. విజయవాడలోని పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో ఈ కార్యక్రమాన్ని సిఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా హైస్కూల్‌లో నాడునేడు పనులను జగన్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ఆయన ముచ్చటించారు. 43 లక్షల మంది విద్యార్థులకు.. విద్యార్థులకు కిట్‌లో భాగంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫామ్స్, బ్యాగ్, షూస్,బెల్ట్, సాక్స్‌లు, మూడు మాస్క్‌లను జగన్ అందచేశారు. యూనిఫామ్స్ కుట్టు కూలి కూడా తల్లుల అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేయనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్ వరకు కిట్ల పంపిణీ జరగనున్నది. ఈ విద్యాకానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.650 కోట్లు ఖర్చు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులకు పైగా కిట్‌లను పంపిణీ చేయనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/