మందడం రైతుల 24 గంటల దీక్ష
62వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళన

అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 62వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు జరుగుతున్నాయి. వెలగపూడిలో 62వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా రైతుల 24 గంటల దీక్షలు జరుగుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/