ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

Inner ring road case.. Chandrababu bail petition adjourned

అమరావతిః అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును హైకోర్టు ఈనెల 26 కి వాయిదా వేసింది. హైబ్రిడ్ విధానంలో ఈ కేసు విచారణకు హైకోర్టు అంగీకరించింది. దీంతో బెయిల్ వస్తుందని ఆశించిన చంద్రబాబుకు నేడు నిరాశే మిగిలింది. ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా టిడిపి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.

ఇందులో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి ఆరోపిస్తోంది. చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్, పొంగూరు నారాయణ కలిసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారని అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై పిటి వారెంట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగగా ఈ కేసుని హైకోర్టు ఈనెల 26 వాయిదా వేసింది.