మునుగోడు ఉప ఎన్నిక ఎఫెక్ట్ : వాయిదా పడిన బండి సంజయ్ 5 వ విడుత పాదయాత్ర

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడం తో బండి సంజయ్ 5 వ విడుత పాదయాత్ర వాయిదా పడింది. తెలంగాణ లోబిజెపి ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బండి సంజయ్…ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నాల్గు విడతలుగా యాత్ర చేపట్టిన సంజయ్..తాజాగా ఐదో విడత పాదయాత్రకు రెడీ అయ్యారు. అక్టోబర్ 15వ తేదీ నుండి పాదయాత్రను కొనసాగించాలని అనుకున్నారు. దీనికి సంబదించిన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు.

అయితే తాజాగా సోమవారం మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడం తో .. బండి సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. ఉప ఎన్నిక అయ్యాక ఈ యాత్ర ప్రారంభం పై క్లారిటీ రానుంది. కాగా.. ఈరోజు మునుగోడు ఉప ఎన్నికకు కాసేపటి క్రితమే షెడ్యూల్‌ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం… ఈ నెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. అలాగే.. 17 వరకు ఉపసంహరణ కార్యక్రమం ఉండనుంది. ఇక నవంబర్‌ 3 న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఫలితాలు వెలువడనున్నాయి.