‘నిమ్మగడ్డ’కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

మంత్రులు ‘పెద్దిరెడ్డి ‘, ‘బొత్స’ శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో అందజేత

Notices of infringement of assembly rights to 'Nimmagadda'
Notices of infringement of assembly rights to ‘Nimmagadda’

Amaravati: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు.

ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/