తులసి ప్రాశస్త్యం

ఆధ్యాత్మిక చింతన

Tulasi kota

తులసి దేవతా మొక్క, తులసి మొక్క ఉండని గృహం ఉండదు. ప్రతి నిత్యం తులసిని సేవిస్తే చాలు భక్తి పారావశ్యంతో మనసు నిడి పోతుంది. మనం ఏ దేవుడికి మాలను సమర్పించాలన్న మాలలో తులసి దళం ఉంటే చాలు భగవం తుడు ప్రీతిపాత్రుడు అవుతాడు.

శ్రీరామునికి భక్తితో తులసి దళమును సమర్పించిన వారు ఖేచరులు, గరుడులు, తులసీ దళమును భక్తితో ఎవరైనా భగవంతునికి సమర్పిస్తే అతనికి భగవంతుడు దేవతల పదవిని సమకూరుస్తాడు. అనగా సాయుజ్యం ప్రసాదిస్తాడు. హరి వంశములో చెప్పబడిన ఒక కథలో శ్రీకృష్ణుని భార్య సత్యభామ తన ధనధాన్యాల, సమస్త ఐశ్వర్యాలు శ్రీకృష్ణునికి ధారాదత్తం చేసినా అతడు ప్రసన్నుడు కాలేదు. సరికదా కరుణ చూపలేదు. కానీ రుక్మిణిదేవి ఒకే ఒక్క తులసి దళమును సమర్పణ చేయగానే దేవదేవుడు శ్రీకృష్ణుడు ప్రసన్నుడవుతాడు, సంతోషిస్తాడు. రుక్మిణి కోరికలు తీరుస్తాడు.

తులసి దళమును అంతటి మహత్తు ఉంది. తులసి దళమునకే ఇంత మహత్తు ఉంటే అనుక్షణం కొలిచే భక్తులు శ్రీకృష్ణు పాదారవిందాలను నిత్య భక్తితో, చిత్తశుద్ధితో సేవిస్తే మోక్షం లభిస్తుంది. కనుక భగవంతునికి సమర్పించే త్రి మాలలోను తులసి ఉండటం శ్రేయస్కరం. తులసి బౌషధ మొక్క కూడా ప్రతి రోజు తులసి ఆకులను తిన్నా కూడా అనారోగ్యాలు దరి చేరవు. తలుసి ఆకులకు అంతటి ప్రాశస్త్యం ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/