పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ పలికిన మాజీ మంత్రి..

గత మూడు నాల్గు రోజులుగా పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మూవీ ఫంక్షన్ లో పవన్ వైసీపీ సర్కార్ ఫై చేసిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన ఫై దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బండారు సత్యమూర్తి పవన్ కు సపోర్ట్ గా మాట్లాడి..వైసీపీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు.

కులమతాలను రెచ్చగొట్టడానికై మంత్రి పేర్ని నాని ఇలా చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు వెనుక సీఎం జగన్‌మోహన్ రెడ్డి హస్తం ఉందన్నారు. మంత్రుల మాట తీరు చూస్తే సిగ్గేస్తుందని.. కుల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 2023కే ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు బండారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆదర్శాల కోసం వచ్చారు తప్ప ఆదాయం కోసం కాదన్నారు. సినిమాల్లోనే ఎక్కువగా డబ్బులు వస్తాయి.. కానీ మంచి ఆదర్శం కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు.