భారత తొలి ఓటర్ ఇకలేరు

భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యామ్‌ శరణ్‌ నేగి(106) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. శ్యామ్ నేగి .. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ లో జులై 1, 1917న జన్మించారు.1951 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన ఓటువేశారు. ఇప్పటివరకు 16 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2014 నుంచి రాష్ట్ర ఎన్నికల బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన నేగీ.. 1975లో రిటైర్‌ అయ్యారు.

ఈ నెల 12న రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కోసం ఆరోగ్యం సహకరించకపోవడంతో రెండు రోజులు క్రితం పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లె చేసుకున్నారు. శ్యామ్ నేగి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని, ఆయనకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు బ్యాండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు.